Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

బ్యాడ్ గర్ల్ కి బాగానే ముట్టజెప్పారు

 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లో సాహో మేనియా కొనసాగుతోంది. మరి కొన్ని రోజుల్లో సాహో విడుదల కానుండడంతో అభిమానులు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విడుదల చేసిన బ్యాడ్ బాయ్ వీడియో సాంగ్ ఆన్ లైన్ లో తెగ రచ్చ చేసేస్తోంది. లిరికల్ రూపంలో కాకుండా ఏకంగా 2 నిమిషాల వీడియోని వదలడం పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. స్టన్నింగ్ విజువల్స్ సూపర్బ్ అనిపించే లొకేషన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

 

ముఖ్యంగా ప్రభాస్ మ్యాచో మ్యాన్లీ లుక్స్ కి జాక్వలిన్ ఫెర్నాండేజ్ అందాలు తోడవ్వడంతో ఇది రిపీట్ మోడ్ లో చూస్తున్న వాళ్ళు ఎక్కువవుతున్నారు. ఇప్పటికే ఈ వీడియో ట్రెండింగ్ లో టాప్ ౩లోకి వచ్చేసింది.ఇక ఈ సోషల్ మీడియాను షాక్ చేస్తున్న ఈ పాట కోసం జాక్వలిన్ ఫెర్నాండేజ్ కు భారీగానే ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ఫిలిం నగర్ టాక్ ప్రకారం కేవలం ఈ ఒక్క పాటకు డాన్స్ చేసినందుకే జాక్వలిన్ కు సుమారు 2 కోట్ల రూపాయలు ఇచ్చారట.

Advertisements

 

error: నమస్కారం!