Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

Chandrayaan 2 : చంద్రుడి అవతలివైపు ఫొటోతీసిన చంద్రయాన్-2

isro releases first image of illuminated image of lunar surface captured by chandrayaan 2

చంద్రుడి కక్ష్య చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2లోని ఆర్బిటర్ అక్కడి ఉపరితలంపై తాజాగా ఫోటోను తీసింది. చందమామకు అవతలివైపు ఉత్తర భాగంలో ఉన్న ఉపరితలాన్ని ఫొటోతీసింది. జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-2 ఆర్బిటర్ తిరిగి పరిశోధనలు ప్రారంభించిందని పేర్కొంది. ఆర్బిటర్‌లోని ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్ఎస్) చంద్రుడిపై కాంతి ప్రసరించిన కొంత భాగాన్ని చిత్రీకరించి పంపిందంటూ ఓ ఫొటోను విడుదల చేసింది ఇస్రో. ఇందులో బిలాలు, సోమర్‌ఫీల్డ్, స్టెబిన్స్, కిర్క్‌ఉడ్‌లు స్పష్టంగా కనబడుతున్నాయి.

 

చంద్రయాన్-2కి ఉన్న ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్ఎస్) పేలోడ్ ద్వారా ఈ ఫొటో లభించింది. చందమామ ఉపరితలంపై ఎంత వరకూ సూర్యుడి ఎండ పడుతుందో లెక్కించడానికి తయారుచేసినదే ఐఐఆర్ఎస్. రకరకాల స్పెక్ట్రల్ ఛానెల్స్ ద్వారా ఈ ఫొటోని రూపొందించినట్లు ఇస్రో తెలిపింది. ఐఐఆర్ఎస్ అనేది చందమామ పై భాగాన్ని (ఉపరితలాన్ని) రకరకాలుగా ఫొటోలు తీస్తుంది. తద్వారా దానిపై ఉన్న ఖనిజాలేంటి? అది ఎలా తయారైంది? అసలు చందమామ ఎలా పుట్టింది అనే అంశాలు తెలుసుకునే ఛాన్స్ ఉందని ఇస్రో చెప్పింది.

 

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!