Subhodayam

Latest Telugu News Updates | Latest News in Telugu | Andhra Pradesh | Telangana | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

IRCTC : ఆన్ లైన్ టికెట్ల పై సర్వీస్ చార్జీ పునరుద్ధరించాలని రైల్వే బోర్డు నిర్ణయం

ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకునే టికెట్ల ధరలు మాత్రమే ప్రియం కానున్నాయి. రైల్వే టికెట్ కౌంటర్లో తీసుకునే టికెట్ల కంటే ఆన్ లైన్ లో బుక్ చేసుకునే టికెట్ల కు కాస్త అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ టికెట్ల పై సర్వీస్ చార్జీ పునరుద్ధరించాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవడంతో పెరుగుదల అనివార్యం కానుంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై సర్వీస్ చార్జీని తొలగిస్తూ మూడేళ్ల క్రితం రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు ఆ టికెట్లపై కేవలం బ్యాంకు చార్జీలు మినహా సర్వీస్ చార్జీ పడేది కాదు.

 

అయితే ప్ర‌యాణికులపై విధించే స‌ర్వీస్ చార్జిల‌ను ఎత్తివేయ‌డం మూలంగా ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా రూ.88 కోట్ల వ‌ర‌కు కేంద్ర ఆర్థిక శాఖ ఐఆర్‌సీటీసీకి బాకీ ప‌డింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆ శాఖ స‌ద‌రు మొత్తాన్ని చెల్లించ‌లేమ‌ని, కావాలంటే ప్ర‌యాణికుల‌పై స‌ర్వీస్ చార్జిల‌ను య‌థావిధ‌గా విధించుకోండి.. అంటూ ఐఆర్‌సీటీసీకి లేఖ రాశారు. అయితే అస‌లే న‌ష్టాల్లో ఉన్న ఐఆర్‌సీటీసీకి కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణ‌యం షాక్ కొట్టేలా చేసింది. దీంతో ఐఆర్‌సీటీసీకి గ‌త్యంత‌రం లేక ఇక‌పై ప్ర‌యాణికుల‌పై ఆ సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటే స‌ర్వీస్ చార్జిల‌ను మ‌ళ్లీ య‌థావిధిగా విధించాల‌ని ఆలోచిస్తోంది.

error: నమస్కారం!