Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

స్విస్ బ్యాంక్ ఖాతాదారుల వివరాలు వచ్చేశాయ్

అక్రమంగా వందలాది కోట్ల రూపాయల సొమ్మును విదేశాలకు మళ్లించి స్విస్‌ బ్యాంకుల్లో దాచుకున్న నల్లకుబేరుల వివరాలు సర్కారు చేతికి అందాయి. ఆ బ్యాంకులో నల్లధనాన్నిదాచుకున్న భారతీయుల వివరాలన్నీ దేశానికి చేరుతున్నాయి. తాజాగా, స్విస్ బ్యాంకుల్లో తమ సంపదను దాచుకున్న భారతీయుల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ టీఏ) కేంద్ర ప్రభుత్వానికి అందించింది.

 

స్విస్‌ బ్యాంకుల్లో 2018లో చురుకుగా ఉన్న భారతీయుల ఖాతాలు, క్లోజయిన ఖాతాల వివరాలను కూడా తాజా సమాచారంలో స్విస్‌ పొందుపరిచినట్లుగా సమాచారం. 2020 సెప్టెంబర్‌లో తదుపరి సమాచార మార్పిడి జరుగుతుందని ఎఫ్‌టీఏ ప్రతినిధి తెలిపారు. ఎఫ్‌టీఏ మొత్తంమీద 75 దేశాలకు చెందిన 31 లక్షల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకోగా, వారి నుంచి 24 లక్షల ఖాతాల సమాచారాన్ని సేకరించింది. ఈ డేటాలో బ్యాంకు ఖాతాదారు పేరు, ఖాతా సంఖ్యతో పాటు ఖాతాదారుని అడ్రస్‌, చిరునామా, పన్ను గుర్తింపు సంఖ్య సహా బ్యాంకు, ఆర్థిక సంస్థ పేరు ఖాతాదారు ఖాతాలో ఉన్న నిధుల వివరాలు, క్యాపిటల్‌ ఇన్‌కమ్‌ వంటి పలు వివరాలు ఉంటాయి.

 

అలాంటి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన జాబితాలో ఎక్కువగా వ్యాపారులు, ఎన్నారైలు ఉన్నట్టు తెలుస్తోంది నల్లధనం వెలికితీతకు చర్యలు ఉంటాయన్న భయంతో పలువురు తమ ఖాతాలు మూసేశారని, అలాంటి వారి వివరాలు ఎక్కువగా ఉన్నట్టుకూడా తెలుస్తోంది.

Read More
error: నమస్కారం!