Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి

అమెరికాలో నార్త్‌ కరోలినాలో ఓ తెలుగు మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అత్తింటి వారి వేధింపులు తాళలేక కొన్నాళ్ల క్రితం వరకు వనిత హైదరాబాద్ లో తల్లిదండ్రుల దగ్గర ఉంది. పెద్దలు సర్దిచెప్పి ఆమెను జులైలో మళ్లీ భర్త దగ్గరకు పంపించారు. అప్పటి నుంచి వనిత తల్లితండ్రులతో మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో వనిత ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులకు సమాచారం అందింది. అత్తింటి వేధింపులు భరించలేకే వనిత మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలంటూ వేడుకుంటున్నారు. వనిత భర్తను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

error: నమస్కారం!