Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

పొట్టని తగ్గించుకోండిలా

How to lose belly in telugu

నేడు ఎక్కువమంది బాధపడుతున్న సమస్య అధిక పొట్ట. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతున్నాయి. ఇందుకోసం రోజూ వ్యాయామం చేస్తున్నప్పటికీ ఆహారంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు నిపుణులు.

 

కొర్రలు, ఓట్స్‌, జొన్నలు, పెసలు, ఉలవలు, కందులు, నీటిశాతం ఎక్కువగా ఉండే బీర, ఆనప, పొట్లకాయ వంటి కూరలు తీసుకోవాలి. పగటి నిద్రకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొట్ట తగ్గించుకునేందుకు కాలేయం పనితీరును పెంచే ఆసనాలుంటాయి. వాటిని చేయడం వల్ల కాలేయం పనితీరు పెరిగి, కొవ్వు తగ్గుతుంది.

Advertisements

 

మితంగా భోజనం: ముఖ్యంగా ఆహారంలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. రకరకాల పిండి పదార్థాలతో బయటచేసే పిండి వంటలు తినకుండా జాగ్రత్త పడాలి. మితంగా భోజనం చేయాలి.

 

నీరు: భోజనానికి 30 నిముషాల ముందు నీళ్ళు బాగా తాగాలి. ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి రెండు గంటల తర్వాత లేదా కనీసం 30 నిమిషాల తర్వాత ఒక్కసారి నీళ్ళు తాగాలి. రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువసార్లు తినాలి. కప్పుడు అన్నంతో పాటూ ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి మాత్రం ఒక్క చపాతీ చాలు. ఆకలేస్తే ఏ పచ్చి క్యారెట్టో, ఆపిల్‌ పండో తినాలి.

 

తేనె: కప్పు గోరు వెచ్చని నీటిలో స్పూన్‌ తేనె కలుపుకొని, పరగడుపున తాగాలి. రోజులో కూడా ఎక్కువగా నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు విసర్జితమవుతాయి.

 

గ్రీన్‌ టీ: సహజంగా లభించే గ్రీన్‌ టీని ఉదయం పూట సేవించాలి. దానిమ్మ జ్యూస్‌ తప్ప మిగతా అన్నిరకాల జ్యూసులను తీసుకోవచ్చు. కాఫీ మాత్రం రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి.

 

బార్లీ గింజలు: అధిక బరువును అరికట్టే ఆహారపదార్థం బార్లీ. ఈ బార్లీ గింజలను గంజి చేసుకొని, తాగడం ద్వారా అధిక బరువును గణనీయంగా తగ్గించవచ్చు. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిని బాగా తగ్గిస్తుంది.

error: నమస్కారం!