Subhodayam

Latest Telugu News Updates | Latest News in Telugu | Andhra Pradesh | Telangana | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

ఎన్ని క్యాలరీల ఆహారం తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు?

మానవ శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరం అనేదానిపై చాలామందికి స్పష్టత ఉండదు. పెరిగే పిల్లలకి, పాలిచ్చే తల్లులకు, గర్భవతులకు పోషకాలు అధికంగా అవసరం కాబట్టి వారి ఆహారంలో క్యాలరీలు ఎక్కువగా ఉండాలి. మధుమేహం ఉన్నవారికి క్యాలరీలు సరిగ్గా సరిపడా ఇవ్వాలి. టీబీ ఉన్నవారు అత్యధిక క్యాలరీలు తీసుకోవాలి. ఇలా వ్యక్తులను బట్టి క్యాలరీల అవసరం మారుతూ ఉంటుంది. అంతేకాదు మన రోజువారి పనిని బట్టి కూడా క్యాలరీలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి 2200 క్యాలరీలు తీసుకోవచ్చు.

 

అయితే ఇప్పటి జీవన విధానానికి 1600 నుంచి 1800 క్యాలరీల ఆహారం తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు. మెయింటనెన్స్‌ సరిగ్గా ఉంటుంది. అందుకే డాక్టర్లు కూడా క్యాలరీలు తగ్గించండి అంటుంటారు. మరి క్యాలరీలు ఎలా తగ్గించుకోవాలి అంటే.. చాలా సింపుల్‌… కొవ్వు పదార్థాలు, పంచదార, స్వీట్లు, ఫ్రై ఫుడ్‌, కూల్‌డ్రింక్స్‌, బిస్కెట్లు, కేకులు, ఐస్‌క్రీమ్‌లు, పిజ్జా, బర్గర్‌, ఆల్కహాల్‌ లాంటి ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని వీలైనంత వరకు తగ్గించాలి అవసరమైతే మానేయాలి. దాని వల్ల మన శరీర బరువు పెరగకుండా ఆరోగ్యంగా ఉంటాము.

error: నమస్కారం!