Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

Rakhi Pournami : రాఖీ పౌర్ణమి చరిత్ర మరియు విశిష్టత

sister tying rakhi to brother

 

హిందు సాంప్రదాయం ప్రకారం, శ్రావణమాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగను మన దేశవ్యాప్తంగా, సోదరులు మరియు సోదరీమణులు మధ్య ప్రేమ మరియు ఆప్యాయతకు గుర్తుగా జరుపుకుంటారు. ఉత్తర భారదేశంలో ఈ పండుగను రక్షాబంధన్ అని పిలుస్తారు. రక్షా- రక్షణ అని, బంధన్- బంధం అని అర్థం.

 

ఈ రోజున సోదరి, సోదరుడికి రంగు రంగుల రాఖీని కడుతుంది. దీనికర్థం- ఈ సంవత్సరం మొత్తం సోదరుడికి విజయం, శాంతి మరియు మంచి ఆరోగ్యం చేకూరాలను ఆశిస్తూ రాఖీని కడుతుంది. అదేవిధంగా, సోదరుడు రాఖీ కట్టిన చెల్లిని ఏ సమస్యలు రాకుండా, జీవితాంతం రక్షగా ఉంటానని భావించే పండుగ గా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాము.

Advertisements

 

నిజానికి, భారతదేశంలో రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎపుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యదారాలు లేవు. కానీ, పురాణాలలో తెలిపిన విధంగా, వివిధ రకాల కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ తెలుపబడ్డాయి.

 

ద్రౌపది -శ్రీకృష్ణుని బంధం

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.

 

అలెగ్జాండర్‌ భార్య – పురుషోత్తముడి కథ

చరిత్ర పుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి అప్ఘనిస్తాన్‌)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చి నాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని తన భర్త అయిన అలెగ్జాండర్‌ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్‌ యుద్ధం విరమించుకుంటాడు.

 

రక్షాబంధనం కట్టేటప్పుడు చదవవలసిన మంత్రం

‘యేన బద్దోబలి రాజూ

దానవేంద్రో మహాబలః

తేన త్వామభిబధ్నామి

రక్ష మాచల మాచల’

 

పాఠకులకు “శుభోదయం” టీమ్ నుండి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

error: నమస్కారం!