Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

శ్రీశైలం : అధికారుల నిర్లక్ష్యం, గేట్లపై నుంచి పొంగిపోర్లుతున్న నీరు

ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పెరిగింది. దీంతో అధికారులు ఆరు గేట్లను 17 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు గేట్ల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా స్పిల్‌వే నుంచి కాకుండా గేట్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఇంతటి భారీ వరద కొనసాగుతున్నా కనీసం అధికారులెవ్వరూ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 3.69 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 3.08 లక్షల క్యూసెక్కులగా ఉంది. పూర్తి స్థాయి నిల్వ సామర్ధ్యం 215.80 టీఎంసీలు.. ప్రస్తుతం 215.32 టీఎంసీల వద్ద నీటిమట్టం నమోదైంది.

error: నమస్కారం!