Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

రోజ్‌వాటర్‌ వల్ల ఉపయోగాలు ఏమిటి ? రోజ్‌వాటర్‌ ని ఇంట్లో చేసుకోవడం ఎలా ?

Health Benefits of Rose Water in Telugu

రోజా పువ్వుల శాస్త్రీయనామం రోసాసరు. ఇందులో సుమారుగా 100కి పైగా జాతులు ఉన్నాయి. ఒక్కొక్క రకం, ఒక్కొక్క రంగు పువ్వులతో ఎంతో మనోహరంగా ఉంటాయి. రోజ్‌వాటర్‌ను మార్కెట్లో కొని తెచ్చుకోవడం కంటే, ఇంటివద్దే తయారు చేసుకొని సహజ చర్మతత్వాన్ని పొందవచ్చు.

 

ఒక పాత్రలో తాజా గులాబీ పువ్వుల రెకులు వేసి అందులో నీరు పోసి బాగా మరిగించాలి. తర్వాత దింపుకొని ఒక గిన్నెలో పోసి మూత పెట్టి బాగా చల్లారనివ్వాలి. కొన్ని గంటలు చల్లారిన తర్వాత ఈ రోజ్‌వాటర్‌ను ఒక మూత ఉన్న డబ్బా లేదా బాటిల్లో నింపుకొని ఫ్రిజ్‌లో పెట్టి 24 గంటలపాటు ఉంచాలి. ఒకరోజు గడిచిన తర్వాత ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి గట్టి మూత ఉండే బాటిల్స్‌లో వడపోపుకొని తాజా, ఫ్రెష్ వాటర్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు.

 

రోజ్‌వాటర్‌ వల్ల ఉపయోగాలు

కాటన్ బాల్స్‌ను రోజ్‌వాటర్‌లో ముంచి ముఖం మీద అద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మం మాత్రమే శుభ్రపడడమే కాకుండా చర్మం గ్రంధులను తెరుచుకొనేలా చేసి, చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది. ముల్తానీమట్టి ఫేస్‌ప్యాస్ కంటే చాలామంచి ఫేస్‌ప్యాక్ ఇది వేసుకోవడం ద్వారా చర్మం ప్రకాశించేలా చేస్తుంది.

 

ముల్తానీమట్టిలో కొద్దిగా రోజ్‌వాటర్ చుక్కలను కలిపి ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసినైట్లెతే ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది. ఆరెంజ్ ఫేస్‌ప్యాక్ చర్మం రంధ్రాలను తెరుచుకొనేలా చేస్తుంది.

 

ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి తర్వాత పౌడర్ చేసుకోవాలి. అందులో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ మిక్స్‌చేసి ముఖానికి ఐప్లె చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖం సహజ రూపంతో ప్రకాశవంతంగా తయారవుతుంది.

 

ఒక టేబుల్‌స్పూన్‌లో రోజ్‌వాటర్, అర టీస్పూన్ పసుపు రెండింటినీ మిశ్రమంలా చేసి వడకట్టండి. ఈ మిశ్రమాన్ని కంటికి సంబంధించిన అలర్జీలు వచ్చినప్పుడు కళ్లలో రెండు చుక్కలు వేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.

 

చర్మానికి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రోజ్‌వాటర్ ఐప్లె చేస్తే.. అది చర్మంలోని పీ.హెచ్ లెవల్స్ బ్యాలెన్స్ చేసి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

 

డ్యామేజ్ అయిన చర్మ కణాలను తిరిగి చైతన్యవంతంగా చేయాలంటే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రోజ్‌వాటర్ ఐప్లె చేయండి.

 

గులాబీ రేకులు పాలలో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసి ముఖానికి ఐప్లె చేస్తే మొటిమల సమస్య తగ్గుతుంది.

 

గులాబీరేకుల పేస్ట్ కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాల మీద ఐప్లె చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!