Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

మెంతులు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

మెంతులు తెలియని వారు ఉండరు. ప్రతీ వంటగదిలో తప్పకుండా ఉండే వస్తువు ఇది. మెంతి పొడిని పప్పుల్లో, పులుసుల్లో, పచ్చళ్లలో కలుపుతారు. అలాగే మెంతి కూర (ఆకు కూర) ను కూడా పప్పు, కూరలలో వాడుతూ ఉంటారు. ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి జీర్ణ సమస్యలు, మధుమేహం, బాధాకరమైన రుతుస్రావం, మెనోపాజ్, పాలిసిస్టిక్ అండాశయం సిండ్రోమ్, ఆర్థరైటిస్, థైరాయిడ్ సమస్య, అధిక రక్తపోటు వంటి గుండెను ప్రభావితం చేసే పరిస్థితులపై కూడా ఉపయోగపడుతుంది. ఇవే కాక ఇవి జుట్టుకు, చర్మానికీ కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్, విటమిన్ ‘C’, నియాసిన్, పొటాషియం వంటి ముఖ్య మూలకాలను కలిగి ఉండే మెంతి విత్తనాల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

జ్వరం తగ్గుటకు: నిమ్మ మరియు తేనెతో కలిపి మెంతి విత్తనాలను తీసుకోవటం వలన జ్వరం తగ్గుతుంది. జ్వరంగా ఉన్న సమయంలో ఈ ఔషదాన్ని తీసుకోవటం వలన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. జ్వరం తగ్గటానికి గానూ, రోజు మూడు సార్లు రెండు చెంచాల మెంతులను నిమ్మ మరియు తేనె కలిపి తీసుకోండి.

Advertisements

 

కొవ్వును తగ్గిస్తుంది: శరీరంలో కొవ్వు పదార్థాల నిర్వహణకు గానూ మెంతులను వాడమని సిఫార్సు చేయవచ్చు. ప్రతిరోజు రెండు ఔన్ల మెంతులను తీసుకోవటం వలన శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గి, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారని వివిధ రకాల పరిశోధనలలో తెలుపబడింది.

 

ఇన్ఫెక్షన్ ల నుండి ఉపశమనం: కాలిన గాయాలు, తామర, చీము పట్టిన గడ్డల వంటి చర్మ ఇన్ఫెక్షన్ ల నుండి ఉపశమనం కలిగించుటలో మెంతులు చాలా శక్తివంతమైన ఔషదంగా పేర్కొనవచ్చు. ఒక చెంచా మెంతులను రుబ్బి, వేడి నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి.

 

గుండె సంబంధిత వ్యాధులు: మెంతులలో ఉండే గ్లాక్టోమాన్నన్ ఉండటం వలన గుండెపోటు కలగకుండా చూస్తుంది. అంతేకాకుండా, పుష్కలంగా పొటాషియంను కలిగి ఉండి చర్యలను అడ్డుకోవటం ద్వారా గుండె సంబధిత వ్యాధులను మరియు రక్తపీడనాన్ని తగ్గిస్తుంది.

 

మధుమేహం: మెంతులు ఆరోగ్యకరం మరియు మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. గ్లాక్టోమాన్నన్, కరిగే ఫైబర్ లను కలిగి ఉండి, రక్తంలో చక్కెరలను గ్రహించే రేటును తగిస్తుంది. మెంతులు అమినో ఆసిడ్ లను కలిగి ఉండి, ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.

 

పాల సామర్ధ్యాన్ని పెంచడానికి: మెంతులలో తల్లిపాల ఉత్పత్తికి కారణమయ్యే ఫైటోఈస్ట్రోజెన్ ఉండటం వల్ల పాలిచ్చే తల్లులలో ఇది పాల సామర్ధ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మెంతులతో చేసిన టీ ని త్రాగడం వల్ల ఈ ఉపయోగాన్ని పొందవచ్చు. అంతేకాక పసి పిల్లలు చక్కగా ఆరోగ్యంగా బరువు పెరగడానికి తోడ్పడుతుంది.

 

జీర్ణ శక్తి పెంపుదల: మెంతులు గ్యాస్ట్రిక్ ఇబ్బందులకు, మల బద్ధకానికి,, కడుపులో వచ్చే అల్సర్లకు అద్భుతమైన మందు. దీనిలోని సహజమైన జీర్ణ శక్తిని పెంపొందించే అంశాలు జీర్ణాశయాన్నీ, ప్రేగుల పనితీరునూ మెరుగుపరుస్తాయి.

error: నమస్కారం!