Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

రోజు యాలకులు తినడం వలన కలిగే ప్రయోజనాలు

యాలకులు అంటేనే వాటి రుచి, సువాసన మనకు గుర్తొకొచ్చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో వీటికి మించినవి లేవు. యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాలకులును రోజు ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూడాలి. ఆకలి మందగించినప్పుడు, వికారంగా, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటే యాలకులు వాడకం చాల మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 

యాలకులలో ఉండే పీచు పదార్ధం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఊపిరితిత్తులలో రక్తప్రసరణ సరిగ్గా జరిగి శ్వాస సంబంధిత సమస్యల నుంచి దూరమవుతారు. ముఖ్యంగా యాలకులును తరుచుగా తినడం వలన మద్యపానం, ధూమపానం మీద ఆసక్తి తగ్గుతుందని చాల పరిశోధనలలో తెలిసింది. మన శరీరంలో వ్యర్ధాలను తొలగించడానికి దీనికి మించిన సుగంధ దినుసులు మరొకటి లేదని చెబుతుంటారు.

Advertisements

 

జలుబు, దగ్గు లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు యాలకులు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన వెంటనే నయమవుతాయని చెబుతున్నారు. రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీరు తాగడం వలన మన శరీరానికి ఎటువంటి మెడిసిన్ అవసరం లేదని చెబుతున్నారు. ఇలా చేయడం వలన మలబద్ధకపు సమస్యతో పాటు, ఆహరం కూడా త్వరగా జీర్ణమవుతుంది. రోజు కనీసం ఒక్క యాలుక్కాయ అయినా తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.

error: నమస్కారం!