Subhodayam

Latest Telugu News Updates | Latest News in Telugu | Andhra Pradesh | Telangana | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

Funny Baboon :సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లిన కొండముచ్చు

 

కోతులు జనావాసాల్లోకి వచ్చాయి అంటే ఇంట్లోకి దూరి తినే వస్తువులు ఎత్తుకు వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పల్లెటూర్లలో ఇళ్లల్లో కోతులు చొరబడి అన్నం, బియ్యం ఇంకా ఏం ఉంటే అవి తినేందుకు ప్రయత్నిస్తాయి. అయితే గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాత్రం ఒక కొండముచ్చు ఇంట్లోకి వెళ్తే దానికి తినేందుకు ఏమి దొరక్కపోవడంతో అక్కడ కనిపించిన మొబైల్‌ ఫోన్‌ను ఎత్తుకు వెళ్లింది. మొబైల్‌ ఫోన్‌ కనిపించడం లేదని అటు ఇటు వెదుక్కుంటున్న వ్యక్తికి తన ఫోన్‌ కొండముచ్చు వద్ద ఉందని తెలిసింది.

 

ఎస్కే చాంద్ బాషా అనే వ్యక్తి, వారం కిందటే రూ. 12 వేలు పెట్టి సెల్ ఫోన్ కొన్నాడు. అతని ఇంట్లోకి చొరబడిన ఓ కొండముచ్చు, చేతిలో ఉన్న సెల్‌ ఫోన్‌ లాక్కెళ్లింది. కొండముచ్చును వెంబడించిన చాంద్‌ బాషా, దానికి అరటిపళ్లు వేశాడు. ఆ పళ్లను తిన్న కొండముచ్చు, సెల్ ఫోన్ ను మాత్రం ఇవ్వలేదు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, మరింత ఆసక్తిగా దాన్ని చూసిందే తప్ప వదిలి పెట్టలేదు. దీంతో రెండు గంటలు ప్రయత్నించిన చాంద్ బాష్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో అవాక్కైన పోలీసులు.. తాము మాత్రం ఏం చేయగలమని అంటూ, కొండముచ్చును కనిపెట్టి ఉండాలని, అది సెల్ ఫోన్ ను వదలగానే తెచ్చుకోవాలని ఉచిత సలహా ఒకటి పారేశారు.

error: నమస్కారం!