కాన్సర్ తగ్గించే చేపలు
ప్రస్తుతం ఉన్న బిజీ పొల్యూషన్ సొసైటీ లో కాన్సర్ మహమ్మారి మరింత విజృంభిస్తోంది. మనం తినే ఆహారంలోనే కొన్ని కాన్సర్ కి దారి తీస్తున్నాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే 40శాతం క్యాన్సర్ వచ్చే సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ చేపలు తింటే కాన్సర్ వచ్చే అవకాశాలు చాల వరకు తగ్గుతాయట. ఆరోగ్యకరమైన ఆహారంలో చేపలది పెద్ద పాత్ర. చేపల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలోని వాపును తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
సాధారణంగా శరీరంలో వాపు ప్రక్రియ డీఎన్ఏను ధ్వంసం చేస్తుంది. దీంతో క్యాన్సర్ కి దారి తీసే అవకాశం ఉంది. అందుకే రోజూ తినే ఆహారంలో చేపలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే వారంలో మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే, వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి ఒకసారి చేప తినేవారితో పోలిస్తే, మూడు సార్లు తినేవారిలో పేగు క్యాన్సర్ ముప్పు 12శాతం తక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. అయితే ఇక్కడ మరో విషయం గమనించాలి. అన్ని రకాల చేపలు శరీరానికి మంచి చేస్తున్నప్పటికీ, సాల్మన్, మాకరేల్ లాంటి చేపలకు మాత్రం కాస్త దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు రకాల చేపల్లో నూనెలు అధికంగా ఉంటాయట. అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిదంటున్నారు.