Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీపెట్టె

మనిషి నిత్య అవసరాలకోసం ఒక్కో పనికి ఒక్కో యంత్రాన్ని కనిపెడుతూ వస్తున్నాడు. తాజాగా బొగ్గు, కరెంట్‌కు బదులు గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీపెట్టెను ఓ కంపెనీ తయారు చేసింది. ఈ ఇస్త్రీ పెట్టెలకు గ్యాస్ పైప్ తగిలిస్తే చాలు ఇస్త్రీ పెట్టె హీట్ అవుతుంది. ఫలితంగా ఇస్త్రీ చెయ్యొచ్చు. ఒక సిలిండర్ తో దాదాపు 500 దుస్తులు ఇస్త్రీ చెయ్యొచ్చు. దాదాపు దీని ధర 8 వేల రూపాయలున్నా నిత్యం బొగ్గుల కోసం వెతికే కన్నా ఇదే మంచిదంటున్నారు దోబీలు. గ్యాస్‌ అందుబాటులోనే ఉంటుంది కావున ఇబ్బంది లేదని అంటున్నారు.

 

రోజు కనీసం బొగ్గుకోసం సగటున వంద రూపాయలు ఖర్చు చేయాలి. ఆదాయం 500 వస్తుంది. అంటే అన్ని పోను కూలి కింద రోజుకు రూ. 200 వరకు మిగులుతాయి. ఈ ఆదాయంతో బతకడం అంటే చాలా కష్టం. అదే గ్యాస్ తో నడిచే ఇస్త్రీ పెట్టెను ఒకసారి కొనుగోలు చేస్తే గ్యాస్ తో నడుస్తుంది. రోజుకు 500 బట్టలు ఈజీగా ఇస్త్రీ చెయ్యొచ్చుని అంటున్నారు.

Advertisements
error: నమస్కారం!