Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు తెలిపే సంకేతాలు

Warning signs of kidney stones

మూత్రపిండాలలో రాళ్లు ఉన్నప్పుడు చాలా నొప్పిగా మరియు చాలా అసౌకర్యంగా ఉంటుంది. అయితే వీటి లక్షణాలను తెలుసుకోవటం వలన ముందుగానే పసిగట్టి చికిత్స అందించవచ్చు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

 

మూత్రపిండాలలో రాళ్లు

మూత్రపిండాలలో లేదా మూత్ర మూత్ర మార్గంలో మినరల్ లు స్ఫటికాకారంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ లేదా మూత్రపిండాల రాళ్లుగా పేర్కొంటారు. మూత్ర పరిమాణం తగ్గటం లేదా అధిక మొత్తంలో లవణాలు స్పటికాలుగా మారటం వలన కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. కిడ్నీ స్టోన్స్ వలన మూత్రంలో రక్తం రావటం మరియు ఉదర భాగంలో నొప్పి లేదా వెన్నుభాగంలో నొప్పి కలుగుతుంది.

 

తరచుగా మూత్రం & నొప్పితో కూడిన మూత్ర విసర్జన

ఉన్నట్టుండి తరచుగా మూత్ర విసర్జన చేయటం అనేది కిడ్నీ స్టోన్స్ యొక్క సంకేతం. ఇలా తరచుగా చేసే మూత్ర విసర్జనతో పాటుగా విసర్జన సమయంలో నొప్పి కానీ కలిగితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని కలిసి, మూత్ర పిండాలలో రాళ్లను గుర్తించే పరీక్ష చేపించుకోండి. రాళ్లు మూత్ర మార్గం నుండి మూత్రాశయంలోకి ప్రవేశించేపుడు, తరచుగా మూత్ర విసర్జనతో పాటూ నొప్పిని కూడా కలిగిస్తాయి.

 

వెన్నుభాగంలో నొప్పి

మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడ్డాయని తెలిపే అత్యంత సాధారణ లక్షణం- వెన్నుభాగంలో నొప్పి. ఈ నొప్పి అకస్మాత్తుగా మరియు చాలా తీవ్రంగా కలుగుతుంది మరియు అపుడపుడు ఉదరభాగంలో నొప్పి కూడా కలగవచ్చు. ఒకవేళ మీరు అకస్మాత్తుగా, వెన్నుభాగంలో లేదా ఉదర భాగంలో నొప్పికి గురైతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని కలవండి.

 

మూత్రంలో రక్తం

మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడ్డాయని తెలిపే మరొక సంకేతం- మూత్రంలో రక్తం. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడిన వారు పింక్, ఎరుపు లేదా గోధుమ రంగులో మూత్ర విసర్జన జరుపుతారు. ఇలా కిడ్నీ స్టోన్స్ అభివృద్ధి చెందటం వలన మూత్రంలో రక్తం విసర్జించబడుతుంది. కావున మూత్రం రంగు మారగానే వైద్యుడిని కలవండి.

 

కూర్చోవటంలో సమస్యలు

కొన్నిసార్లు, కిడ్నీ స్టోన్స్ పరిమాణం చాలా పెద్దగా మారతాయి, ఫలితంగా ఆ వ్యక్తి కూర్చోటానికి కూడా ఇబ్బందిగా భావిస్తుంటాడు. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడిన వ్యక్తి కూర్చోటానికి ఇబ్బందిగా భావిస్తూ, నిలబడటానికి ప్రాముఖ్యత చూపిస్తుంటాడు.

 

వాపులు

మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లు వాటి పరిమాణం పెరిగిన కొలది వాపులకు మరియు చాలా నొప్పికి గురవుతుంటాడు. ఉదర భాగంలో లేదా వెన్నుముక కింది భాగంలో వాపు లేదా ఇన్ఫ్లమేషన్ కలిగితే వెంటనే వైద్యుడిని కలవండి.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!