Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

రోజు రెండు గుడ్లకు మించి తింటే ప్రమాదమేనట

కోడి గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి రోజూ ఒక కోడిగుడ్డు తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. గుడ్డులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాహారాలని అందించడంలో కోడి గుడ్డు ముందు ఉంటుంది. అందుకే శాకాహారులను కూడా కోడి గుడ్డు తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. చిన్న పిల్లలకు సైతం రోజుకో గుడ్డు తినిపించాలంటారు. అయితే ఆరోగ్యానికి మంచి చేసేవే అయినప్పటికీ అతిగా తింటే ప్రమాదమే అంటున్నారు నిపుణులు.

 

రోజుకి ఎక్కువలో ఎక్కువ రెండు కోడి గుడ్లు తినవచ్చట. అంతకు మించి తింటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. రోజూ రెండు కంటే ఎక్కువ కోడిగుడ్లు తింటే గుండెకు ముప్పని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్లలో కొవ్వు ఎక్కువగా ఉంటుందట. ఒక్కో గుడ్డులో దాదాపు 200 మిల్లీగ్రాముల కొవ్వు ఉంటుందని, ఇది రోజుకు 300 మిల్లీగ్రాములు దాటితే గుండెజబ్బులు రావడానికి ఆస్కారం ఉందని, చనిపోయేందుకు కూడా అవకాశం ఉందని అంటున్నారు.

Advertisements
error: నమస్కారం!