Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

‘చందమామ’ యాత్రలో ‘చంద్రయాన్ 2’ మరో ముందడుగు

 

 

చంద్రయాన్-2 ఉపగ్రహం జాబిలమ్మకు మరింత చేరువవుతుంది. చంద్రయాన్-2 వాహకనౌక భూ కక్ష్యను మూడోసారి పెంచింది ఇస్రో.. ఈ రోజు మ‌ధ్యాహ్నం 3.12 గంటలకు మూడో ప్రక్రియ‌ను విజ‌య‌వంతంగా చేపట్టారు. సుమారు 989 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొన‌సాగింది. అనంతరం చంద్రయాన్‌-2 వాహ‌క‌నౌక 276 x 71792 కిలోమీట‌ర్ల ఎత్తుకు చేరుకున్నట్టు ప్రకటించారు శాస్త్రవేత్తలు.

 

చంద్ర‌యాన్ వ్యోమ‌నౌక అన్ని ప్యారామీట‌ర్ల‌తో స‌హ‌జంగా వెళ్తున్న‌ట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆగ‌స్టు 2వ తేదీన వ్యోమ‌నౌక‌కు చెందిన నాల్గో భూక‌క్ష్య పెంపు ప్రక్రియ‌ను నిర్వహించ‌నున్నారు. శుక్రవారం మ‌ధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంట‌ల మ‌ధ్య ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇలా ఈ ప్రక్రియ వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగనున్నట్టు ఇస్రో ప్రకటించింది .

 

 

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!