Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

నా ఇల్లు ముంచాలనుకొని పేదల ఇళ్ళు ముంచారు : చంద్రబాబు

 

కృష్ణా నది వరదముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుఈ రోజు పర్యటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ప్రజలను కలుసుకున్నారు. కరకట్ట వెంట ప్రజలను పలకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ళు మునిగిపోయి అవస్థలు పడుతున్నా అధికారులు, మంత్రులు ఎవరూ సాయం చేసేందుకు రాలేదని బాధితులు అన్నారు. ఎలా వస్తారు? మంత్రులంతా నా ఇంటిచుట్టూ తిరిగారని ఆయన అన్నారు.

 

వరద నివారించే అవకాశం ఉన్నప్పటికీ, నీళ్లు కావాలని నిలబెట్టి, నా ఇంటిని ముంచే ప్రయత్నంలో ప్రజల ఇళ్ళను ముంచింది ప్రభుత్వం. ఇది అన్యాయం. మా హయాంలో కొంతవరకు రిటైనింగ్ వాల్ కట్టడం మూలంగా దాదాపు 50 వేల మంది ముంపు నుంచి రక్షించబడ్డారు. వాల్ పూర్తయ్యే వరకు, టీడీపీ ప్రజలకు అండగా ఉంటుందని అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు.

Advertisements

 

ప్రభుత్వ మాటలు కోటలు దాటాయి, చేతలు మాత్రం గడప దాటలేదు. అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే వరద బాధితుల ఆకలి తీర్చేవి. వాటినీ మూసేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలి. విజయవాడ ముంపు ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మించాలి. స్థానికులందరికీ పట్టాలివ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

 

error: నమస్కారం!