Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

చంద్రబాబు చేతికి గాయం.. కారణం అదే అంటున్న డాక్టర్లు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతికి గాయం అయ్యింది.  చేతి నరాల వాపు కారణంగా ఈ గాయం అయినట్టు డాక్టర్లు పేర్కొన్నారు.  రెండు రోజులపాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు.  డాక్టర్ల సూచన మేరకు చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే విశ్రాంతి తీసుకోబోతున్నారు.

అయితే, చంద్రబాబు చేతికి గాయం ఎందుకైంది. కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే, గతంలో బాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అలిపిరి వద్ద జరిగిన బ్లాస్ట్ లో బాబు కుడిచేతికి దెబ్బతగిలింది.  చేతి నరాలపై దెబ్బ తగలడంతో గాయాలు మానినా ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఇలా వాపు వస్తుందని వైద్యులు చెప్తున్నారు.  విజయవాడలో జరిగిన పార్టీ సమావేశానికి బాబు చేతి కట్టుతోనే హాజరయ్యారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!