Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

ఛలో ఆత్మకూరు.. తాడో పేడో తేల్చుకోవడమే : చంద్రబాబు

వైసీపీ అరాచకాలు ఒక్క పల్నాడు ప్రాంతానికే పరిమితం కాలేదని.. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అయితే పల్నాడు ప్రాంతంలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టే అక్కడినుంచి పోరాటం మొదలుపెట్టినట్టు చెప్పారు. ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దపడుతున్నామని రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గుంటూరు తరలిరావాలని పిలుపునిచ్చారు.

 

ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తుందని, ఒకవేళ వారు అడ్డుపడితే ఎక్కడికక్కడ ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ అరాచకాలను టీడీపీ వెలుగులోకి తీసుకొచ్చేదాకా పోలీసులు ఏం చేసినట్టు అని ప్రశ్నించారు. వైసీపీ అరాచకాల కారణంగా బాధితులంతా 110 రోజులుగా గ్రామాలకు దూరంగా ఉన్నారని చెప్పారు. పల్నాడు శరణార్థుల శిబిరంలో పోలీసులు ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు గురజాల డివిజన్‌లో 144 సెక్షన్ విధించారని ఆరోపించారు. ఇదేమని అడిగితే, పండుగలు, శాంతిభద్రతలు అంటున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయ శాంతిభద్రతలకు సంబంధించిన విషయమే తప్ప పండుగల శాంతిభద్రతకు సంబంధించిన విషయం కాదని చెప్పారు. ఇప్పటికైనా బాధితులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Read More

 

error: నమస్కారం!