Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

జనసేన ఎమ్మెల్యే పై కేసు నమోదు..అరెస్టుకు రంగం సిద్ధం

 

జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేకాడుతున్నవారికి వత్తాసు పలకడమే కాకుండా, పోలీస్ స్టేషన్ పై దౌర్జన్యం చేసి, ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. మలికిపురంలో పేకాడుతున్న 9 మందిని స్థానిక ఎస్సై కేవీ రామారావు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వారిని విడిచి పెట్టాలని రాపాక వరప్రసాద్, అతని అనుచరులు ఎస్సైతో ఘర్షణ పడ్డారు. పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారు.

 

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సుమారు 100 మంది కలసి పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వి, కిటికీ అద్దాలు పగలగొట్టారని తెలిపారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అన్నారు. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. రాపాక వరప్రసాద్ పై గతంలో రెండు కేసులు ఉన్నాయని చెప్పారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, ఎంతటి వారైనా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!