Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స

Botsa Satyanarayana Sensational comments on Amaravati

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించడానికి గత ప్రభుత్వం పూనుకొని, దీనికి సంబంధించిన పలు డిజైన్లను కూడా ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిపై ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందన్నారు.

 

త్వరలోనే ఈ విషయమై ప్రకటన చేయనున్నట్టు బొత్స వివరించారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం భారీగా ఉందన్నారు. సాధారణ వ్యయం కంటే అమరావతిలో ఎక్కువ ఖర్చు అవుతోందని బొత్స సత్యనారాయణ చెప్పారు.రాజధాని ప్రాంతంలో ఫైఓవర్లు, భారీ కట్టడాలు కట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో ప్రజా ధనం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisements

 

ఇటీవల సంభవించిన వరదలతో ఈ ప్రాంతం ముంపుకు కూడ గురయ్యే అవకాశం ఉందని తేలిందన్నారు. దీని నుండి కాపాడేందుకు కాలువలు, డ్యామ్ లను నిర్మించాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ చెప్పారు.వరద నీటిని బయటకు పంపేందుకు నీటిని తోడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కారణాలపై ప్రభుత్వం అమరావతి విషయమై చర్చిస్తున్నట్టుగా బొత్స తెలిపారు.

error: నమస్కారం!