Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

‘నాసా’ యాత్రకు భాష్యం ఐఐటీ స్కూల్ విద్యార్థిని సాయి పూజిత

 

అమెరికాలోని ప్రతిష్టాత్మక నాసా అంతరిక్ష సంస్థ సందర్శనకు తెలుగు విద్యార్థిని ఎంపికైంది. భాష్యం IIT అకాడమీ ఫౌండేషన్‌లో 9వ తరగతి చదువుతున్న జి.సాయి పూజిత దీనికి ఎంపికైంది. ఆస్ట్రానాట్ మెమోరియల్ సంస్థ, ఫ్లోరిడా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ, గో ఫర్ గురు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ పరీక్షలో పూజిత అద్బుత ప్రదర్శన కనబరిచింది. దేశవ్యాప్తంగా 826 విద్యాసంస్థల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు.

 

ఈ సందర్భంగా భాష్యం విద్యాసంస్థల డైరెక్టర్ ఆశాలత సాయి పూజితను సత్కరించారు. దేశానికి మంచి పేరు తెచ్చిందని కొనియాడారు. పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో నాసా సందర్శనకు సాయి పూజిత ఎన్నికైనట్లు తెలిపారు సాయి పూజిత సెప్టెంబర్ 30న నాసా సందర్శనకు వెళ్లనున్నట్లు తెలిపారు. 10 రోజులపాటు అమెరికాలోని నాసా అంతరిక్ష సంస్థను సందర్శిస్తుందన్నారు. భాష్యం ఉపాధ్యాయుల సూచనలు, తల్లిదండ్రుల సహకారం వల్లే నాసా సందర్శనకు ఎన్నికయ్యానని సాయి పూజిత తెలిపింది. నాసా సందర్శనార్థం ఉచితంగా విమాన టికెట్‌ను నాసా వ్యోమగామి డాక్టర్ డాన్ ధామస్ అందించారని, అబ్దుల్ కలాం మై ఇన్‌స్పిరేషన్, మై హీరో అనే అంశంపై రాసిన వ్యాసానికి గాను సాయి పూజిత అర్హత సాధించినట్లు వెల్లడించారు.

Read More
error: నమస్కారం!