Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

హీరోగా బెల్లంకొండ గణేష్ చిత్రం ప్రారంభం

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ రెండో కొడుకు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా పరిచయమవుతున్నాడు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తడాఖా, అల్లుడు శీను, రభస వంటి చిత్రాలకు నిర్మాత, సహనిర్మాత గా వ్యవహరించారు గణేష్. అన్నపూర్ణ స్టూడియోస్‌లోని గ్లాస్ హౌస్‌లో ఈ చిత్రం ప్రారంభమయింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వి వి వినాయక్, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు గా హాజరయ్యారు.

 

బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ సమర్పణలో, లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ సినిమాలతో ఆకట్టుకున్న పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నాడు. గణేష్‌పై చిత్రీకరించిన ఫస్ట్ షాట్‌కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నివ్వగా, బెల్లంకొండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ఛాన్ చేశాడు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. రధన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisements
error: నమస్కారం!