Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారంలోకి బాలకృష్ణ

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చావా కిరణ్మయికి మద్దతుగా ప్రముఖు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారానికి హాజరు కానున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సూచన మేరకు నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీలోగా హుజూర్ నగర్ లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. తాను నందమూరి బాలకృష్ణతో మాట్లాడానని, ఆయన ప్రచారం నిర్వహించేందుకు అంగీకరించారని చంద్రబాబు చెప్పారు. హుజూర్ నగర్ స్థానాన్ని ఎలా అయినా తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, బీజేపీలు కూడా పక్కా వ్యూహరచనతో ముందుకు పోతున్నాయి.

error: నమస్కారం!