Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

‘బజాజ్ స్కూటర్లు’ మళ్ళీ వస్తున్నాయ్

 

bajaj chetak electric scooter
బజాజ్ చేతక్ ఒకప్పుడు ఎంతో మందికి ఇష్టమైన స్కూటర్. కాలం మారేకొద్ది స్కూటర్లు వాడే వాళ్ల సంఖ్య తగ్గడంతో వాటికి డిమాండ్ తగ్గింది. ఆనాటి చేతక్ మళ్లీ మార్కెట్లోకి తెచ్చి వాహన ప్రియులను తమవైపు తిప్పుకునే ప్లాన్ వేసింది. అందుకే సరికొత్త స్కూటర్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది.

 

దీనికోసం మునుపటికి భిన్నంగా ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టబోతోంది. అదిరిపోయే డిజైన్‌తో కస్టమర్లకు ఆకట్టుకునే తయారు చేశారు. ఈనెల 16న దీన్ని మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతోందని తెలుస్తోంది. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఫీచర్స్ వంటి ప్రత్యేకతలు ఉండే అవకాశముంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోనూ తెర వైరల్ అవుతున్నాయి. దీని ధర రూ.80,000 నుంచి రూ.లక్ష మధ్యలో ఉండొచ్చనే అంచనాలున్నాయి.

Read More
error: నమస్కారం!