Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

మాటిచ్చి నిలబెట్టుకున్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇచ్చిన మాట మీద నిలబడి, మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. తలైవా ఇచ్చిన మాట ప్రకారం తన మొదటి సినిమా (భైరవి) నిర్మాతకు అండగా నిలిచారు. ఆ నిర్మాతకు సొంత ఇల్లు లేదని తెలుసుకున్న సూపర్ స్టార్ ఇల్లు బహుమతిగా ఇచ్చారు.

 

గత నెల కలైజ్ఞానంకు సీనియర్ దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో సన్మానసభ జరిగింది. చెన్నైలో జరిగిన ఈ సభకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలైజ్ఞానం పరిస్థితి గురించి తెలుసుకున్న రజిని సభలోనే అందరి ముందు ఆయనకు అండగా ఉంటానని మాట ఇచ్చారు. వీలైనంత త్వరగా ఆయనకు సొంత ఇల్లు ఏర్పాటుచేస్తానని చెప్పిన రజినీ చెప్పినట్టుగానే కలైజ్ఞానంకు ఇల్లు కొన్నారు. అక్టోబర్ 7వ తేదీ దగ్గరుండి మరీ ఆయన చేత గృహప్రవేశం చేయించారు. రజినీ మంచి మనసుకు సినీ రంగ ప్రముఖులు, ప్రేక్షకులు అభినందనలు తెలుపుతున్నారు.

Advertisements
error: నమస్కారం!