Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

జవాన్‌ మృతికి భారత్‌ ప్రతీకారం

Army jawan killed

 

జమ్మూకశ్మీర్ పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కసు తో పాక్ ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రత పరంగా అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఒకవేళ ఉగ్రవాదులు ఆకృత్యాలకు పాల్పడితే, ఈసారి రెట్టింపు స్థాయిలో భారత్‌ నుంచి సమాధానం ఉంటుందని తేల్చి చెప్పారు.

 

శనివారం రాజౌరీ జిల్లాలో నౌషీరా సెక్టార్‌ సమీపంలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు, ఆర్మీ పోస్టులపై పాక్‌ సైన్యం మోర్టార్లు, చిన్నచిన్న ఆయుధాలతో కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ కాల్పుల్లో డెహ్రాడూన్‌కు చెందిన లాన్స్‌నాయక్‌ సందీప్‌ థాపా (35) చనిపోయారు.

Advertisements

 

శనివారం ఉదయం 6.30 నుంచి పాకిస్థాన్‌ వైపు నుంచి కాల్పులు మొదలయ్యాయని, భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందని రక్షణశాఖకు చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో పలువురు పాక్ సైనికులు హతులై ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఇరు పక్షాల మధ్య భీకర పోరు సాగుతోంది.

error: నమస్కారం!