Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

మరో వివాదంలో మంత్రి పుష్ప శ్రీవాణి

ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిని మరోసారి కులవివాదం చుట్టుముట్టింది. ఆమె ఎస్టీ కాదంటూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేష్ , అఖిల భారత దళిత హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్‌ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుకు ఫిర్యాదు చేశారు.

 

బుట్టాయగూడెంలో జన్మించిన పుష్ప శ్రీవాణి గిరిజన వ్యక్తి కాదని, ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా ఆమెది కొండదేవర తెగ కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలంటూ జిల్లా పరిశీలన కమిటీ విచారణకు కలెక్టర్‌ ఆదేశించినట్లు సమాచారం. ఈ వివాదంపై పుష్పశ్రీవాణి స్పందిస్తూ ఇవన్నీ కూడా గిట్టనివారు అనవసరంగా పుట్టిస్తున్నటువంటి రాజకీయ కుట్రలు అని ఆమె చెబుతున్నారు.

Advertisements
error: నమస్కారం!