Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

సాక్షిగా కొత్త అవతారంలో అనుష్క ‘నిశ్శబ్ధం’

భాగమతి తర్వాత అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరిట రిలీజ్ కాబోతుంది. ఈచిత్ర షూటింగ్ ఎక్కువ భాగం అమెరికా లోనే జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ చిత్ర టైటిల్ పోస్టర్ విడుదలై సినిమా ఫై ఆసక్తి పెంచడమే కాదు, ఈ మూవీ లో అనుష్క లుక్ ఎలా వుండబోతుందనే ఆత్రుత పెంచింది. తాజాగా ఆ ఆతృతను చిత్ర యూనిట్ తెరదించారు.

 

అనుష్క శెట్టితో పాటు ఈ సినిమాలో మాధవన్, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే, హీరోయిన్ అంజలి, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు వంటి స్టార్ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతకాలపై నిర్మితమవుతున్న సినిమా భారత చలన చిత్ర సినిమాలో ఓ ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోతుందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ‘వర్ణ’, ‘సైజ్ జీరో’ వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి నటిగా నిరూపించుకున్న అనుష్క… మరోసారి ‘సైలెంట్‌’గా తన టాలెంట్ చూపించడానికి రెఢీ అవుతోందన్న మాట.

Read More
error: నమస్కారం!