Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

ఆసుప‌త్రిలో అమితాబ్‌..కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న అమితాబ్

Amitabh Bachchan admitted to Mumbai hospital

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కాలేయ సంబంధ సమస్యలతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. గత మూడు రోజులగా ఆయన ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఐసీయూ తరహాలోని రూమ్‌లో ఆయనను ఉంచారని తెలుస్తుంది. కాగా, అమితాబ్‌ రెగ్యులర్‌గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం అడ్మిట్‌ అయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

 

కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారని పేర్కొన్నాయి. అమితాబ్‌ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. రెగ్యులర్ గా వైద్య పరీక్షలు చేయించుకుపోవటంతో వైద్య పరీక్షల్లో క్షయ వ్యాధి ఉందని తెలిసిందని, ఇప్పటికే 75 శాతం లివర్ పూర్తిగా చెడిపోయిందని కేవలం 25 శాతం లివర్ తోనే సర్వైవ్ అవుతున్నానని అమితాబ్ బచ్చన్ గతంలో చెప్పారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!