Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

2 ఉడకబెట్టిన గుడ్లు అక్షరాలా రూ. 1700

 

 

కార్తీక్ ధర్ అనే వ్యక్తి ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో భోజనం చేశాడు. అయితే భోజనం అనంతరం వచ్చిన బిల్లును చూసి అతను ఖంగుతిన్నాడు. తాను ఆర్డర్ చేసిన రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లకు రూ.1700, 2 ఆమ్లెట్లకు రూ.1700, మరో రెండు ఆమ్లెట్లకు ఒక్కొక్కటి రూ.850 చొప్పున అదొక రూ.1700, రెండు డైట్ కోక్‌లకు ఒక్కొక్కి రూ.260 చొప్పున మొత్తం రూ.520, మరొక కోక్‌కు రూ.260, ఫుడ్‌కు రూ.5100, శీతలపానీయానికి రూ.780, జీఎస్‌టీ రూ.1058.40 మొత్తం కలిపి రూ.6,938.40 బిల్లు వచ్చింది. దీంతో అతను షాక్ తిన్నాడు.

 

అలా తాను తిన్న ఆహారాలకు దారుణమైన బిల్లు వచ్చే సరికి కార్తీక్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో నటుడు రాహుల్ బోస్ పెట్టినట్లుగానే ఆ బిల్లు కాపీని ఫొటో తీసి అతను కూడా ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేశాడు.అంతే కాదు ఆ ట్వీట్ లో సోదరా నిరసన కార్యక్రమం చేపడదామా’ అంటూ తన తోటి బాధితుడైన రాహుల్‌ బోస్‌ను తన పోస్ట్‌కి ట్యాగ్‌ చేశారు.

 

 

 

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!