Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

అరుదైన వజ్రం వెలికితీత.. వజ్రం కడుపులో వజ్రం

800 million-year-old rattling diamond with 'gem-inside-a-gem found in Siberia

వజ్రంలో వజ్రం ఉన్న అరుదైన ఈ రత్నం రష్యాలోని అల్రోసా పీజేఎస్‌సీ మైనింగ్ కంపెనీ తవ్వకాల్లో లభ్యమైంది. సైబేరియా ప్రాంతంలోని న్యూర్బా గనుల్లో తవ్వకాలు జరుపుతుండగా ఈ అరుదైన వజ్రం లభించింది. వజ్రం బరువు 0.62 క్యారెట్లు వుండగా, లోపలున్న వజ్రం బరువు 0.02 క్యారెట్లు వుంది. ఇది సుమారు 800 మిలియన్ సంవత్సరాల క్రితానికి చెందినదని చెబుతున్నారు. ఈ తరహా వజ్రం కనిపించడం ఇదే తొలిసారని, దీన్ని ‘మట్రోష్కా డైమండ్‌’గా వ్యవహరిస్తారని తెలిపింది. తమకు ఈ వజ్రం దొరకగానే సదరు కంపెనీ దీన్ని పరిశోధనల కోసం పంపించింది. తదుపరి పరిశోధనలకు ఈ వజ్రాన్ని అమెరికా కూడా పంపనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

error: నమస్కారం!