Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

రూ.307 కోట్ల నిజాం నిధికి 120 మంది వారసులు

120 descendants for nijam stake

దాదాపు ఏడు దశాబ్దాలపాటు న్యాయపోరాటం లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో గల నిజాం సంపదపై ఆయన వారసులతోపాటు భారత ప్రభుత్వానికి చెందుతుందనే తీర్పును లండన్‌లోని రాయల్‌కోర్ట్స్ ఆఫ్ జస్టీస్‌ తీర్పు చెప్పింది. నిజాం 1948లో పాక్ అధికారుల ద్వారా రహస్యంగా లండన్‌కు పంపిన సొమ్ము దాదాపు 3.5 కోట్ల పౌండ్లు ( రూ. 307 కోట్లు) సొమ్మును తామంతా కలసి పంచుకుంటామని నిజాం ఎస్టేట్ సభ్యులు తెలిపారు.

 

నిజాం వంశానికి చెందిన 120 మంది ఆస్తిపాస్తుల కోసం నిజాం ఎస్టేట్‌గా ఏర్పాడ్డారు. లండన్ బ్యాంకులోని సొమ్ము కోసం భారత ప్రభుత్వం కలసి పోరాడారు. కేసు గెలవడంతో పంపకాల సంగతి తేలాల్సి ఉంది. నిజాం వారసుల్లో చాలామంది పూట గడవని వాళ్లు ఉన్నారని, కొందరు మాత్రమే ధనికులని ఎస్టేట్ సభ్యులు చెబుతున్నారు. నిజాం ఎస్టేస్ ప్రతినిధి నజఫ్ అలీఖాన్ సొమ్ము పంపిణీపై విలేకర్లతో మాట్లాడుతూ.. తామంతా కలిసి డబ్బును ఎలా పంచుకోవాలో చర్చించుకుంటామన్నారు. కాగా, బ్రిటన్ హైకోర్టు తీర్పు అంతిమం ఏమీ కాదని, దీనిపై అప్పీలుకు వెళ్తామని పాకిస్తాన్ అంటోంది. అప్పీలుకు కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది.

Advertisements
error: నమస్కారం!